అక్బర్ మహారాజు ఆస్థానంలో బీర్బల్ ఒక మంత్రిగా ఉండేవాడు. ఒక రోజు ఒక ధనవంతుడైన వ్యాపారి ఆస్థానానికి వచ్చి, ఇలా చెప్పాడు,” రాజుగారు! నా డబ్బంతా ఎవరో దొంగిలించారు!” “నువ్వు ఎవరినైనా అనుమానిస్తున్నావా?” అని బీర్బల్ అడిగాడు. ” అవును!, నాకు ఇంట్లో ఏడుగురు పనివారు ఉన్నారు, వారిలో ఒకరు దొంగిలించారని నేను అనుకుంటున్నాను.” అని వ్యాపారి చెప్పాడు.
Birbal was a minister in the king Akbar’s court. One day a rich merchant came to the court, said like this, ” King! Someone stole all my money!” ” do you suspect anyone?” Birbal asked. “Yes! I have seven servants in the home, I suspect that one of them has stolen.” the merchant said.
ఏడుగురు పనివాళ్లను ఆస్థానానికి తీసుకొచ్చారు. ప్రతివక్కరకు బీర్బల్ దాని మీద వాళ్ళ పేర్లతో ఉన్న ఒక చిన్న కర్రను ఇచ్చాడు. ” జాగ్రత్తగా వినండి! ఇవి ఒక సాధువు చేత నాకు ఇవ్వబడిన మంత్రదండాలు. ఈ మంత్రదండాలకు దొంగను చూపించే శక్తి ఉంది. దొంగతో ఉన్న కర్ర రాత్రి సమయంలో పెరుగుతుంది. మీరు ఈ కర్రలను రేపు ఉదయం వరకూ వేరు వేరు గదులలో పెట్టాలి. అప్పుడు నేను ఈ కర్రలను తనిఖీ చేస్తాను.” అని బీర్బల్ చెప్పాడు.
The seven servants were brought to the court. Birbal gave each of them a small stick with their names on it. ” listen carefully! These are magic sticks given to me by a holy man. These magic sticks have the power to show the thief. The stick which is with the thief will grow during the night. you will put these sticks in the different rooms until tomorrow morning. Then I will check these sticks.” Birbal said.
అందరూ ఉదయాన్నే వచ్చారు. పనివాళ్లను ఆస్థానానికి తీసుకొచ్చారు. ఆ కర్రలను ఒకదాని తరువాత ఒకటి కొలిచారు. ఒక కర్ర తక్కువ కొలతతో ఉంది. ఆ కర్ర యొక్క యజమానిని బంధించారు. ఎందుకో ఊహించండి? కర్ర రాత్రి సమయంలో పెరుగుతుందని దొంగ అనుకున్నాడు. కావున కొంచెం కత్తిరించాడు. కావున అది మిగతా కర్రల కన్నా చిన్నదిగా అయ్యింది!
All came morning itself. The servants were brought to the court. The sticks were measured one by one. A stick was with a less measure. The owner of the stick was arrested. Guess what? The thief thought that the stick would grow during the night. So he cut a little. So it became shorter than the other sticks!