ఒకానొకప్పుడు రాములు అనే ఒక కట్టెలు కొట్టే వాడు నివసిస్తుండేవాడు. అతడు మరియు అతని భార్య సీత అడవికి దేగ్గర్లో నివసించారు. ప్రతిరోజూ రాములు అడవికి వెళ్తుండేవాడు మరియు కట్టెలు కొడుతుండేవాడు. అతడు కట్టెలను దేగ్గర్లోని ఒక మార్కెట్ లో అమ్ముతుండేవాడు. రాములు మరియు సీత పేదవారు. ఒకరోజు ఎప్పటిలాగానే అతడు అడవికి వెళ్ళాడు.
Once upon a time a wood cutter used to live named Ramulu. He and his wife Sita lived near the forest. Every -day Ramulu used to go to the forest and cut the wood. He used to sell the wood nearby a market. Ramulu and Sita were poor. One day as usual he went to the forest.
అతడు కట్టెలు కొడుతూ ఉన్నాడు. అతడికి ఒక గొంతు వినబడింది,”సహాయం! సహాయం! దయచేసి నాకు సహాయం చేయండి!” అతడు చుట్టూ చూసాడు. అతడు ఎవ్వరినీ చూడలేదు. అప్పడు అతనికి ఆ గొంతు మళ్ళీ వినబడింది. “రాములు! నేను ఇక్కడ క్రింద ఉన్నాను. దయచేసి నాకు సహాయం చేయి.!”
He was cutting the wood. He heard a voice, “Help! Help! Please help me!” he looked around. He didn’t see anyone. Then he heard the voice again. “Ramulu! I am down here. Please help me.!”
అప్పుడు అతడు మంత్రశక్తులు గల ఒక చిన్న దేవతని ఒక చెట్టు యొక్క కొమ్మ క్రింద చిక్కుకోవటం చూసాడు. రాములు కొమ్మను తొలగించాడు. అప్పుడు ఆ చిన్న మంత్రశక్తి గల దేవత సంతోషించింది. రాములు నీకు చాలా ధన్యవాదాలు! నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నేను నీకు మూడు వరాలు ఇస్తాను. మీరు ఏమి వరాలు కోరుకుంటారో ఇంటికి వెళ్లి నీ భార్య తో చర్చించు. మీరు వాటిని పొందుతారు.
Then he saw a fairy caught under the branch of a tree. Ramulu removed the branch. Then the fairy felt happy. Ramulu thank you very much! You saved my life. I will give you three boons. Go home and discuss with your wife what boons you whish. You will get them.