The magic sticks part 01
Telugu Text:
అక్బర్ మహారాజు ఆస్థానంలో బీర్బల్ ఒక మంత్రిగా ఉండేవాడు. ఒక రోజు ఒక ధనవంతుడైన వ్యాపారి ఆస్థానానికి వచ్చి, ఇలా చెప్పాడు," రాజుగారు! నా డబ్బంతా ఎవరో దొంగిలించారు!" "నువ్వు ఎవరినైనా అనుమానిస్తున్నావా?" అని బీర్బల్ అడిగాడు. " అవును!, నాకు ఇంట్లో ఏడుగురు పనివారు ఉన్నారు, వారిలో ఒకరు దొంగిలించారని నేను అనుకుంటున్నాను." అని వ్యాపారి చెప్పాడు.
Your English Translation:
The magic sticks part 02
Telugu Text:
ఏడుగురు పనివాళ్లను ఆస్థానానికి తీసుకొచ్చారు. ప్రతివక్కరకు బీర్బల్ దాని మీద వాళ్ళ పేర్లతో ఉన్న ఒక చిన్న కర్రను ఇచ్చాడు. " జాగ్రత్తగా వినండి! ఇవి ఒక సాధువు చేత నాకు ఇవ్వబడిన మంత్రదండాలు. ఈ మంత్రదండాలకు దొంగను చూపించే శక్తి ఉంది. దొంగతో ఉన్న కర్ర రాత్రి సమయంలో పెరుగుతుంది. మీరు ఈ కర్రలను రేపు ఉదయం వరకూ వేరు వేరు గదులలో పెట్టాలి. అప్పుడు నేను ఈ కర్రలను తనిఖీ చేస్తాను." అని బీర్బల్ చెప్పాడు.
Your English Translation:
The magic sticks part 03
Telugu Text:
అందరూ ఉదయాన్నే వచ్చారు. పనివాళ్లను ఆస్థానానికి తీసుకొచ్చారు. ఆ కర్రలను ఒకదాని తరువాత ఒకటి కొలిచారు. ఒక కర్ర తక్కువ కొలతతో ఉంది. ఆ కర్ర యొక్క యజమానిని బంధించారు. ఎందుకో ఊహించండి? కర్ర రాత్రి సమయంలో పెరుగుతుందని దొంగ అనుకున్నాడు. కావున కొంచెం కత్తిరించాడు. కావున అది మిగతా కర్రల కన్నా చిన్నదిగా అయ్యింది!