The elephants and the hares part 01
Telugu Text:
చాల కాలం క్రితం కొన్ని ఏనుగులు ఒక అడవిలో నివసిస్తుండేవి. వాటి రాజు పేరు చతురద. అది వేసవి. నీటి గుంతలు మరియు చెరువులు ఎండిపోయాయి. ఏనుగులు దాహాంతో చనిపోతున్నాయి. "నీటితో నిండి ఉండే ఒక చెరువు నాకు తెలుసు. నేను మిమ్మల్ని అక్కడకు తీసుకెళ్తాను" ఏనుగుల రాజు చెప్పింది. అవి బయలుదేరాయి.
Your English Translation:
The elephants and the hares part 02
Telugu Text:
ఏనుగులు అక్కడకు వెళ్లాడానికి ఐదు రోజులు నడిచాయి. చివరకు అవి అక్కడకు చేరుకున్నాయి. చెరువు చుట్టూ అంతటా రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాలలో కుందేళ్లు నివసిస్తున్నాయి. అక్కడికి ఏనుగులు చేరుకున్నప్పుడు, అవి కుందేళ్ళ మీద తొక్కుకుంటా నడిచాయి. చాలా కుందేళ్లు చనిపోయాయి.
Your English Translation:
The elephants and the hares part 03
Telugu Text:
తక్షణమే, కుందేళ్ళ యొక్క రాజు ఒక సమావేశాన్ని నిర్వహించింది. " మనము ఏమి చేద్దాం" అని అడిగింది. అప్పుడు ఒక చిన్న తెలివైన కుందేలు చెప్పింది, " ఓ రాజా! ఈ చెరువు చంద్రుడికి చెందింది అని ఏనుగుల యొక్క రాజుకు చెపుదాం. కుందేళ్ళను చెరువు దెగ్గర నివసించడానికి చంద్రుడు అనుమతిచ్చాడు. ఏ ఇతర జంతువులను ఈ చెరువు ఉపయోగించుకోవడానికి చంద్రుడు అనుమతించడు."